పవన్ కళ్యాణ్ కోసం.. నాగార్జున చేసిన త్యాగం..!

పవన్ కళ్యాణ్ కోసం.. నాగార్జున చేసిన త్యాగం..!
Latest News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో, సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, ఎంతోమంది అభిమానుల్ని తన నటనతో పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు. ఇటు మన్మధుడు నాగార్జున కూడా తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య పెద్దగా అనుబంధం ఉండకపోయినా ఒకసారి పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున పెద్ద త్యాగం చేశారు. మరి నాగార్జున పవన్ కళ్యాణ్ కోసం చేసిన త్యాగం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ కోసం.. నాగార్జున చేసిన త్యాగం..!
Nagarjuna

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ ని పవన్ కళ్యాణ్ పెట్టక ముందు నాగార్జున తమ్ముడు అనే టైటిల్ తో ముందే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నారట. పవన్ కళ్యాణ్ సినిమా కోసం దర్శకుడు తమ్ముడు టైటిల్ ని అనుకున్నారు. ఆ టైంలో నాగార్జున రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ చెప్పడంతో నాగార్జున టైటిల్ ని వదులుకున్నారు. నాగార్జునకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మా సినిమాకి తమ్ముడు టైటిల్ బాగుంటుంది. మా కోసం వదులుకోరా అని రిక్వెస్ట్ చేస్తే నాగర్జున టైటిల్ ని వదిలేసారు. ఇలా ఇంత పెద్ద త్యాగం చేశారు.