నేడే YSR కాపు నేస్తం..ఒక్కో అకౌంట్‌లో రూ.15వేలు జమ

Today YSR Kapu Nestham..deposit Rs.15 thousand in each account
Today YSR Kapu Nestham..deposit Rs.15 thousand in each account

ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇవాళ వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనుంది జగన్‌ సర్కార్‌. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగానే… ఇవాళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏపీ సర్కార్‌ ఆర్థిక సహాయం చేయనుంది .

వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా అర్హులైన 3,57,844 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి. ఏటా రూ. 15,000 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ. 75,000 ఆర్థిక సాయం చేయనుంది జగన్‌ సర్కార్‌.ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొననుంది సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. లండన్ పర్యటన తర్వాత మొదటి సారి బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…చంద్రబాబు అరెస్ట్‌ కూడా మాట్లాడే ఛాన్స్‌ ఉంది.