నటి సూసైడ్….పరిస్థితి విషమం !

TV Actor Nilani suicide Attempt

కలసి ఉన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు విడిపోయాక నానా తిట్లూ, గొడవలు, హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు ఇలా అనేక కోణాలు వేలుగుచుస్తూ ఉంటాయి ప్రేమికుల విషయాల్లో వివాదాస్పద తమిళ టీవీ నటి నీలాణి, ఆమె ప్రియుడు లలిత్ కుమార్ కథ ఇలాంటిందే. తాము మూడేళ్లుగా కలిసి తిరిగామని కానీ ఇప్పుడు అతను అంటే ఇష్టం లేదని కానీ అతడు ఇప్పుడు పెళ్లి చేసుకొమ్మంటూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనను ఏమైనా చేస్తారనే భయంతో సదరు ప్రియుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకుని ఆస్పత్రి పాలయ్యి మరణించాడు. ఈ విషయం తెలిసిన నీలాణి గురువారం ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం కేకే.నగర్‌లోని ఆస్పత్రిలో ఆమె విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోంది.

TV actress Nilani

గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్య పై కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది.ఆ తరువాత చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని, అతను తనను నుంచి డబ్బు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేసింది. అయితే తన తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో మరి ఏమి ఆలోచించిందో ఏమో కానీ నీలాణి గురువారం స్థానిక ఆలపాక్కంలోని ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె కేకే.నగర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.