మహాభారతం నుంచి ఆమిర్ ఖాన్ ఔట్ ??

Aamir Khan's Mahabharata lands

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ తనకి ఎంతో ఇష్టమైన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని గురించి ఎన్నో సార్లు మీడియా కి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అత్యంత భారీ వ్యయంతో అంటే సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది అని ప్రచారం కూడా జరిగింది. దీని గురించి ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ లతో ముఖ్యమైన పాత్రలు గురించి సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి ఆమీర్ ఖాన్ తప్పు కోవాలని చూస్తున్నారని బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం జరుగుంది.తనకి ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్ట్ ని ఆమీర్ ఖాన్ దీనిని మూడు దశలు గా తెరకి ఎక్కించాలనుకున్నారు, దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొన్ని నెలలు పాటు సాగుతుంది అని వార్తలు ఇంతకముందు హల్చల్ చేసాయి, అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ ని ఆమీర్ రద్దు చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు రద్దు చెయ్యాల్సి వస్తుందో సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ కొన్ని ఊహాగానాలు మాత్రం లేకపోలేదు. కొన్ని విభాగాలు నుండి వొచ్చిన సమాచారం ప్రకారం ఆమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంత సమయం నేను కేటాయించగలనో లేదో అని సంకోచం లో పడ్డారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి..

Aamir Khan May Not Make The Mahabharata

అంతేకాకుండా అతను అనుకున్న ప్రకారం గా మహాభారతాన్ని మూడు భాగాలుగా తీయాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఆమీర్ అనుకున్న 1000 కోట్లు బడ్జెట్ కి మించి అవ్వచ్చు మరియు ఇది కమర్షియల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచనలో ఆమిర్ పడ్డారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని ముకేశ్ అంబానీ నిర్మించడానికి ముందుకు రావడం తో ఈ ప్రాజెక్ట్ పై అందరికి ఆశలు పెరిగాయి , అంతేకాకుండా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్ కూడా దీనిలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వొచ్చింది కానీ ఇంతలోనే ఇలాంటి వార్త రావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. మరి ఈ వార్తలో నిజ నిజాలు గురించి ఆమీర్ ఖాన్ స్పందిస్తే అందరికి ఒక క్లారిటీ వొచ్చేస్తుంది.

Aamir Khan

మరోపక్క అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అని తెలిసింది ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించి అమితాబ్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చెయ్యడం జరిగింది. ఈ చిత్రాన్ని నవంబర్ 7 ప్రేక్షకులు ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.