ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల గొడవ లేదట!

NTR And ANR Positive Roles in NTR Biopic

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, ఏయన్నార్‌ పాత్రలో సుమంత్‌ ఉన్న ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎలాంటి వివాదం లేకుండా దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు అంటూ చెప్పేందుకు ఇదే నిదర్శణం.

NTR And ANR

గతంలో ఎన్టీఆర్‌ మరియు ఏయన్నార్‌ల మద్య విభేదాలు ఉన్న విషయం తెల్సిందే. కెరీర్‌ ఆరంభంలో ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్నా కూడా ఆ తర్వాత తర్వాత ఇద్దరి మద్య గొడవ ప్రారంభం అయ్యిందని టాక్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత ఇద్దరి మద్య వివాదం మరింతగా ముదిరినట్లుగా అప్పట్లో టాక్‌ వచ్చింది. ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వెన్ను పోటును చూపించని దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వివాదాన్ని కూడా చూపించడం లేదని క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. రానా, సుమంత్‌ ఇంకా పలువురు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Kalyan Ram Playing Hari Krishna Role In Ntr Biopic Movie