ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించిన ట్విట్టర్

ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించిన ట్విట్టర్

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇటలీ లాంటి దేశాల్లో ప్రజలు బయటకు రాకుండా నిషేధం విధించారు. అలాగే అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని సూచించాయి.సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. ప్రాణాంతక కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ట్విట్టర్ పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ హెచ్ఆర్ చీఫ్ జెన్నీఫర్ క్రిస్టీ బుధవారం తన బ్లాగ్‌లో తెలియజేశారు.. ‘తాము మునుపటి మార్గదర్శకానికి మించి వెళ్తున్నాం … ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులందరికీ వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాం’ అని అన్నారు.కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చైనా వెలుపల కరోనా వైరస్ కేసులు గత రెండు వారాల్లో 13 రెట్లు పెరిగినట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నామ్ గ్యాబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు.