దోషం పేరు సొంత మేనకోడలి మీద…నాలుగేళ్లగా అత్యాచారకాండ

Uncle Raped His Daughter In Law For Four Years

సొంత మేనకోడలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. అది కూడా జాతకంలో దోషం ఉందంటూ మాయ మాటలు చెప్పి లోబరుచుకొని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటీవలే ఆమెకు పెళ్లయింది. అయినప్పటికీ తన కోరికను తీర్చాలంటూ ఆమెను వేధించాడు. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పిందామె. అతడి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

arrest
పోలీసుల చెబుతున్న వివరాల మేరకు నగరంలోని నారేల ప్రాంతానికి చెందిన యువతిపై సొంత మేనమామ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు. యువతి జాతకంలో దోషం ఉందని ఎప్పటికీ పెళ్లి కాదని తండ్రి కూడా చనిపోతాడని ఆమెను భయపెట్టాడు. తాను చెప్పినట్లు వింటే దోషం పోతుందని తర్వాత మాయ మాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత కూడా ఆమెను బెదిరిస్తూ అఘాయిత్యానికి ఒడిగడుతూనే ఉన్నాడు. నాలుగేళ్లుగా ఈ దారుణానికి పాల్పుడుతూనే ఉన్నాడు.

Blind Girl Rape In Madhya Pradesh
ఇటీవలే ఆమెకు పెళ్లయింది. అయినప్పటికీ తన కోరికను తీర్చాలంటూ ఆమెను వేధించాడు. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పిందామె. అయినా ఆ దుర్మార్గుడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తూనే ఉన్నాడు. అతడి టార్చర్ భరించలేని బాధితురాలు అత్తింటివారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కు నెట్టినా ఆ నీచుడికి బుద్ధి రాలేదు. తన మేనకోడలు జాతకంలో దోషం ఉందని నివారణ కోసమే అత్యాచారం చేశానంటూ గొప్పగా చెప్పాడట ఆ కలియుగ కీచకుడు.