పిచ్చి కుక్కలా వాగకు… నానికి వంశీ వార్నింగ్ !

Vallabhaneni Vamsi Comments on Kodali Nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రానున్న ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో వేడిని రాజేయనున్నాయి అని అర్ధమవుతోంది. ఇప్పుడు రాజకీయం ఎప్పటి నుండో ప్రాణ మిత్రులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రాజేసింది. వారెవరో కాదు వల్లభనేని వంశీ, కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వీరిద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు. అయితే కొడాలి నాని పార్టీ మారినా వారి మధ్య సాన్నిహిత్యం కోసాగుతునే వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో కొడాలి నాని హెచ్చుమీరి చంద్రబాబు మీద మాట్లాడటం అలాగే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని ఉద్దేశించి వంశీ తీవ్ర హెచ్చరికలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద ఫైర్ అయిన సంగతి తెల్సిందే.

కొడాలి నానీ విమర్శలపై స్పందించిన వంశీ… జగన్ పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ తామిద్దరం మంచి స్నేహితులమని అంటూనే చంద్రబాబును తిడుతున్నారని నాని నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నువ్వు నేను ఒకప్పుడు స్నేహితులమే కానీ ఇప్పుడు కాదు, చంద్రబాబును తిడితే తాను సహించేది లేదని నానిని వంశీ హెచ్చరించారు. ఇప్పుడు అసలు కొడాలి నానితో తనకు స్నేహమే లేదన్నారు వంశీ. ఇలా పిచ్చికుక్కలా మాట్లాడే వారిని కంట్రోల్ చేయకపోతే జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవని వంశీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వంశీ వార్నింగ్ మీద కొడాలి నాని ఇంకా స్పందించలేదు అయితే ఈ అంశం మీద కొడాలి నాని స్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు. ఎన్టీఆర్ హీరోగా వీరిద్దరూ కలిసి నిర్మాతలుగా అదుర్స్ సినిమా కూడా తీశారు.