మహేష్‌తో సుకుమార్‌ మళ్లీ అదే తప్పు!

mahesh babu 26th film with sukumar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు. ఇదే ఉత్సాహంతో తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వినీదత్‌ మరియు దిల్‌రాజులు సంయుక్తంగా మహేష్‌బాబు 25వ చిత్రం నిర్మాణం జరుగుతుంది. మహేష్‌బాబు 25వ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే అప్పుడే 26వ చిత్రం గురించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు 26వ చిత్రం తెరకెక్కబోతుంది. మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది. ఈ చిత్రం గురించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీవర్గాల్లో చర్చ లేపుతోంది.

మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘1’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. దర్శకుడు సుకుమార్‌ కాస్త అతిగా ఆ చిత్రంకు ఖర్చు చేయించాడు. తాజాగా ఇప్పుడు మహేష్‌ 26వ చిత్రానికి కూడా భారీ బడ్జెట్‌ను ఖర్చు చేయాల్సి ఉంటుందని ముందే మైత్రి మూవీస్‌ వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. ‘రంగస్థలం’ చిత్రంను ఒక మోతాదు బడ్జెట్‌తో తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్‌ మళ్లీ మహేష్‌బాబు సినిమాను లేని పోని గొప్పలకు పోయి ఎక్కువ బడ్జెట్‌ పెట్టిస్తున్నాడని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఈసారి మాత్రం మహేష్‌కు రికార్డు సక్సెస్‌ను ఇస్తాను అంటూ సుకుమార్‌ నమ్మకంగా చెబుతున్నాడు.