రైల్వే టీసీ మీద ‘షేకింగ్ శేషు’ టీం ఎటాక్…

Jabardasth Shaking Seshu team attack on Railway TC

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సెలబ్రిటీలు అంటే చాలు వారు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా విశేషమే. బయటకు అడుగు పెడితే చాలు, వారు వెంటాడే డేగ కళ్ల గురించి భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఏ మూల ఏదైనా తప్పు చేసి దొరికిపోతామేమో అన్న భావన సెలబ్రిటీల్లో కనిపిస్తుంది. అందుకే వారు సాధారణంగా మీడియాకు దూరంగా ఉండాలని చూస్తారు. కేవలం సినిమాల ప్రమోషన్లప్పుడు మాత్రమే అదీ తప్పదు కాబట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక మిగిలిన అన్ని సమయాల్లోనూ మీడియా కంట కనబడరు. అయితే అలా వారు ఇతర విషయాల సందర్భంగా కనబడితే మాత్రం అది లేదా వైరల్ న్యూస్ అవడం ఖాయం. ఇప్పుడీ సంగతంతా జబర్ధస్త్ పేరుతో అందులోని యాక్టర్లు ఎంత ఫేమస్ అయ్యారో తెలియనిది కాదు.

అయితే జబర్దస్త్ షేకింగ్ శేషు, మరికొంత మంది సభ్యులు విశాఖ రైల్వేస్టేషన్ లో హల్ చల్ చేసి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో షేకింగ్ శేషు అండ్ టీం చేసిన రచ్చ చర్చనీయాంశం అయ్యింది. విజయనగరం నుంచి వైజాగ్ వరకు వస్తున్న వీరు జనరల్ టికెట్ తీసుకున్నారు. అయితే జనరల్ లో ఎక్కాల్సిన వీరు థర్డ్ ఏసీ బోగీలోకి ఎక్కారు. ఆరుగురు సభ్యులున్న వీరు ఒకేసారి బోగీలోకి రావటంతో టీసీ ప్రశ్నించాడు. జనరల్ టికెట్ తీసుకుని ఏసీ బోగీలోకి ఎలా వస్తారని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో వీరి వాగ్వాదం జరిగింది.

జనరల్ టికెట్ తీసుకుని ఏసీ బోగీలోకి ఎక్కింది నిజమే అని… అయితే ఫైన్ రాసుకోవాలి కానీ… ఇష్టమొచ్చినట్లు టీసీ తిట్టాడని చెబుతున్నారు షేకింగ్ శేషు. వీరి వాదనతో టీసీ విబేధిస్తున్నాడు. పెద్ద పెద్ద అరుపులు, కేకలతో వచ్చారని.. మిగతా ప్రయాణికులతో కూడా దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నాపైనే జబర్థస్త్ సెలబ్రిటీలం అంటూ హంగామా చేశారని టీసీ అంటున్నారు. వీరితో ప్రయాణించిన ఓ అడ్వొకేట్ కూడా టీసీ మాటల్ని సమర్ధించడం గమనార్హం. దీంతో ఆ టీసీతో జబర్థస్త్ టీం సభ్యులు వైజాగ్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై వాగ్వాదానికి దిగారు ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు రావడంతో జబర్దస్త్‌ నటులు చివరకు ఆ గొడవ ఆపేసి లోపలికి వెళ్లిపోయారు. ఏంటో సెలబ్రిటీలు అంటేనే కళ్ళు నెత్తికి ఎక్కుతాయి కాబోలు, నిన్న మొన్నటి దాకా ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చామని కబుర్లు చెప్పిన వారు కాస్త దూరానికి ఏసీ లేకుండా ఉండలేకపోయారు.