రాజకీయాల్లోకి రాబోతున్న రామ్ గోపాల్ వర్మ

రాజకీయాల్లోకి రాబోతున్న రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ పేరే ఒక సంచలనం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందిస్తూ జనాల్లోహాట్‌ టాపిక్‌ కావడం ఒక్క వర్మకే చెల్లుతుంది. ఇటీవల ఆయన ఎక్కువగా రాజకీయ నాయకులను టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై విమర్శనాత్మక ట్వీట్లు చేస్తున్నాడు.

దీంతో వర్మ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఈ రూమర్లపై తాజాగా వర్మ స్పందించాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, ప్రజలకు చేయాలనే కోరికే లేదని కుండబద్దలు కొట్టాడు. ఓ ప్రముఖ తెలుగు వార్త చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

రాజకీయ నాయకులపై ఎప్పటికప్పుడు పవర్‌ఫుల్‌ సెటైర్లు వేస్తున్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా, పాలిటిక్స్‌లోకి రావాలనే ఆలోచననే లేదన్నాడు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే పాలిటిక్స్‌లోకి వస్తారని, తనకు ఆ ఉద్దేశమే లేదన్నాడు.

తనకు తాను సేవ చేసుకోవడానికి సమయంలేదని, ఇంక ప్రజలకు సేవ ఎలా చేస్తానని తిరిగి విలేకరినే ప్రశ్నించాడు. ‘సహజంగా ఏ నేత అయినా ఫేమ్‌, పవర్‌ కోసమే పాలిటిక్స్‌లోకి అడుగుపెడతాడు కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజాసేవ అని పైకి చెబుతుంటాడు’ అని రాజకీయ నేతలపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు వర్మ.