వరుణ్‌ నిన్ను కోరి చేస్తే..!

Varun Tej next film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే ‘మిస్టర్‌’ చిత్రంతో ఫ్లాప్‌ అయ్యి ఆ వెంటనే ‘ఫిదా’ చేసిన వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాు కూడా వరుణ్‌ తేజ్‌ కమిట్‌ అవ్వడం జరిగింది. వెంకీ అట్లూరితో సినిమా పూర్తి అయిన తర్వాత వరుణ్‌ తేజ్‌ తర్వాత సినిమా ‘నిన్ను కోరి’ దర్శకుడితో ఉండబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. నాని, నివేదా థామస్‌ జంటగా నటించిన నిన్ను కోరి చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకు ప్రశంసలు అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించేందుకు సిద్దం అయ్యాడు. 

విభిన్నమైన ప్రేమ కథతో ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తెరకెక్కించిన శివ ప్రస్తుతం ఒక క్యూట్‌ వ్‌స్టోరీని సిద్దం చేస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌ తగ్గట్లుగా ఆ కథను డిజైన్‌ చేస్తున్నాడు. ఇటీవలే మెగా కాంపౌండ్‌లో ఆ కథను వినిపించడం నాగబాబు మరియు చిరంజీవిలు కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. విభిన్న ప్రేమ కథతో రూపొందబోతున్న ఆ సినిమాను వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆ సినిమాను నిర్మిచేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే వరుణ్‌ తేజ్‌, శివ నిర్వాణల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి సినిమా మరి కొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది.