వరుణ్ తేజ్ తొలిప్రేమ అదిరిందిగా

varun tej tholi prema first look poster release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుణ్‌ తేజ్‌, వెంకీ అట్లూరిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. మొదటి నుండి కూడా ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికి ఆ టైటిల్‌ను పెట్టే సాహసం చేస్తారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్‌ కెరీర్‌లో నిలిచి పోయే చిత్రాల్లో ఒక్క చిత్రం ‘తొలిప్రేమ’. ఆ చిత్రంతో పవన్‌ స్థాయి అమాంతం పెరిగింది. ఆ టైటిల్‌తో సినిమా అంటే అంచనాలు అదే రేంజ్‌లో ఉంటాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా తొలిప్రేమ టైటిల్‌తో ఆ సినిమా స్థాయి మారిపోతుంది. అందుకే ఆ స్థాయిని అందుకోవడం వరుణ్‌ తేజ్‌ వల్ల అవ్వక పోవచ్చు. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ పెట్టక పోవచ్చు అంటూ కొందరు విశ్లేషించారు.

అన్ని ఆలోచించుకుని కథపై ఉన్న నమ్మకంతో ‘తొలిప్రేమ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను సాయి ధరమ్‌ తేజ్‌ కోరుకున్నప్పటికి నిర్మాత మరియు దర్శకుడు ఇదే టైటిల్‌ను ఖరారు చేయడంతో వరుణ్‌కు తొలిప్రేమ దక్కింది. భారీ స్థాయిలో అంచనాలుంటాయని తెలిసి కూడా దర్శకుడు సాహసంతో ఈ టైటిల్‌ను ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లుగా ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ నెలలో షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే నెలలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. తొలిప్రేమ టైటిల్‌ పెట్టారు కనుక పవన్‌ ప్రమోషన్స్‌లో కనిపించే అవకాశం ఉంది. కనీసం ఆడియో విడుదల వేడుక సందర్బంగా అయినా వచ్చే అవకాశం ఉంది.

 

varun-tej