వరుణా నీ కరుణ కావాలిప్పుడు

Varuna needs your compassion

ప్రపంచకప్ సంరంభం మొదట్లో ఉన్న జోష్ రోజు రోజుకి తగ్గిపోతుంది, దక్షిణాప్రికా వరుస పరాజయాలు, పసికూన బంగ్లా అద్బుత పోరాటంతో మాంచి మాసాల మ్యాచులుంటాయని ఆశించిన సగటు ప్రేక్షకునికి వర్షం పెద్ద అడ్డంకిగా మారింది, పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో నాలుగు మ్యాచుల్ని చెడగొట్టి టాప్ ఆర్డర్లో ఉంది, ఇదంతా ఒకెత్తైతే రేపటి భారత్-పాక్ మ్యాచ్ ఇటు ఆట పరంగా అటు వాణిజ్య పరంగా ఐసిసికి కీలకమైన మ్యాచ్, అందుకే ఇప్పుడు ప్రపంచ క్రిడా ప్రేమికులతో పాటు, అటు స్పాన్సర్లు, ఇటు బీసీసీఐ, ఐసీసీ ఇప్పుడు వరుణా నీ కరుణ కావాలి అంటూ వేడుకుంటున్నారు, మ్యాచ్ జరగబోయే మైదానంలో ప్రస్తుతానికి వాతావరణం అనుకూలించినా.. రేపటి మ్యాచ్ వరకీ టెన్షన్ మాత్రం కంటిన్యూ అయ్యేలా ఉంది.