చంద్రబాబుకి గన్నవరం దెబ్బ

gannavaram blow to chandrababu

బళ్లు ఓడలవుతాయి ఓడలు బళ్లవుతాయి అంటే ఇదే, ఒకప్పుడు దర్జాగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ముఖ్యమంత్రి హోదాలో రాజసం ప్రధర్శిస్తూ వెళ్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆ రాష్ట్ర ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో గ‌డ్డు ప‌రిస్థితి ఎదురైంది. విమానాశ్ర‌యంలోకి వెళ్లే ముందు బాబును అక్క‌డ ఉన్న సిబ్బంది చెక్ చేశారు, ఓ సాధార‌ణ వ్య‌క్తిలా ట్రీట్ చేశారు, బాబు కాన్వాయ్‌ను విమానం వ‌ర‌కు తీసుకు వెళ్ల‌నివ్వ‌లేదు. అతి సాదారణ ప్రయాణికుడిలా బాబుని చూడటం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.