దెయ్యం పేరుతొ రేప్…హైదరాబాద్ లో నయా మోసం

rape on nine months baby

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా ప్రజల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాల మీద నమ్మకం పోవడం లేదు. ఈ కారణంగా కొందరు మోసగాళ్లు మంత్రాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లో దెయ్యం ఉందని దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు ఒక యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బోరబండకు చెందిన దంపతుల అనుమానాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  తమ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం, పలు సమస్యలు వస్తుండటంతో కొన్ని వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూతవైద్యుడు ఆజంను కలిశారు ఆ దంపతులు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని వివరించాడు. ఇందుకోసం వారిని నుంచి సార్లు పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ దర్గాకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే దంపతుల కుమార్తె మీద కన్నేసిన ఆజం తనను పెళ్లి చేసుకోకుంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజలు క్రితం దంపతుల ఇంటికి వచ్చిన వారి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతని మీద పోలీసులని ఆశ్రయించారు.