కలెక్టరేట్ లోని మహిళను రేప్ చేసిన కలెక్టర్

20-year-old- girl gang-rape-in-chittoor

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కలెక్టర్ ఘోరానికి పాల్పడ్డారు. జంజ్‌గిర్‌-చంపా జిల్లా మాజీ కలెక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయింది. జిల్లా మాజీ కలెక్టర్‌ జేకే పాతక్‌పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పరుల్‌ మథూర్‌ తెలిపారు. అదేమంటే.. కేసుకు సంబంధించిన ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మే 15వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లుగా మహిళ ఫిర్యాదు చేసింది. అలాగే.. కలెక్టర్‌ తన కార్యాలయంలోనే ఈ అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా ఆ మహిళ వివరించింది.

పెళ్లైన మహిళను ఆఫీసులో అత్యాచారానికి పాల్పడిన జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి కలెక్టరేట్‌లోనే అత్యాచారానికి పాల్పడటంపై కలకలం రేగుతోంది. ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి.. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ తనను ఛాంబర్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అయితే కొన్నాళ్లుగా కలెక్టర్‌ తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని..  మే 15వ తేదీన తన ఛాంబర్‌కు పిలిపించి అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చి ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఎస్పీకి అందజేశారు. దీంతో పోలీసులు జనక్ ప్రసాద్‌పై ఐపీసీ 376, 506, 509(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా జనక్ ప్రసాద్ పాథక్‌ను ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా మే 26వ తేదీన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మహిళ నుంచి పూర్తిస్థాయిలో స్టేట్‌మెంట్‌ను తీసుకున్నామని.. మొబైల్‌ రికార్డ్స్‌ను పరిశీలించినట్లు కూడా ఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.