దారుణం: లాక్ డౌన్ అవకాశంగా యువతిపై రెండు నెలలుగా ……

Gangsters don't leave HIV victim ... gang rape

సమాజంలో కరోనా అనిలేదు. లాక్ డౌన్ అని చూసే జనం లేరు. దొరికిన వాడు ఆనందాల కోసం వెంపర్లాడటం ఒక్కటే రూట్ గా ఎంచుకుంటున్నాడు. కామాతురానాం నభయం నలజ్జ అంటూ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో యువతిని ప్రలోభపెట్టిన కొందరు కామాంధులు ఓ హోటల్‌లో ఆమెను నిర్బంధించి రెండు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనపై సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.

అయితే రీనా రౌత్రాయ్ తెలిపిన విషయాలను బట్టి చూస్తే.. ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె మేనత్త మార్చి నెలలో ఇంటికి తీసుకొచ్చింది. మార్చి 20న నందన్ అనే వ్యక్తి వద్దకు ఆమెను పంపింది. ట్రైనింగ్ పేరుతో నందన్ ఆమెను ఓ హోటల్‌ గదిలో ఉంచాడు. ఈలోగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో యువతి ఇంటికి వెళ్లలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదే అవకాశంగా భావించిన నందన్ రోజూ తన ఫ్రెండ్స్‌తో కలిసి గదికి వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవాడు. తమకు సహకరించకపోతే చంపేస్తామని ఆ కామాంధుడు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది.

అంతేకాకుండా హోటల్‌ గదిలో ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో తనపై జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు కూడా ఆమె చేరవేయలేక ఘోరమైన నరకాన్ని అనుభవించింది. అయితే నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఆ యువతి తాను కటక్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నానని తెలిపింది. ఏం జరిగిందోనన్న ఆందోళనతో వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురిని చూసి చలించి పోయారు.

రెండు నెలలుగా నందన్, అతడి స్నేహితుల చేతిలో తాను అనుభవించిన చిత్రహింసలు, లైంగికంగా ఆ గ్యాంగ్ తనను పెట్టిన హింస ఆ యువతి తల్లిదండ్రులకు తెలిపింది.

అంతటితో ఆగకుండా నాలుగు రోజుల క్రితం తన మేనత్త హోటల్‌ గదికి వచ్చి తనను కిటికీలో నుంచి బయటకు తోసేసిందని.. ఆపై తీవ్ర గాయాలైన తనను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపింది. కాగా ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు కటక్ బంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రీనా రౌత్రాయ్ స్పష్టం చేశారు. అలాగే.. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని… అలా కాని పక్షంలో తాము మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకే తాను ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు రీనా రౌత్రాయ్ వివరించారు.