రష్యాలో అధికమౌతోన్న పినుజుల దండయాత్ర

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దీంతో పాటు కొత్తగా తూర్పు ఆఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ భారత్ లలో మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది. అయితే తాజాగ మానవాళిపై యుద్ధానికి కొత్త శత్రువు దూసుకొస్తోంది. రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపేసే పినుజులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. సైబీరియా ప్రాంతంలో సాధారణం కంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది రెట్లు అధికంగా పినుజులు కన్పిస్తున్నాయి.

క్రాస్నోయార్క్స్ ప్రాంతంలో ఇప్పటికే ఎనిమిదివేల రెండు వందల పదిహేను పినుజు కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండు వేల నూట ఇరవై ఐదు మంది పిల్లలున్నారు. సెల్యులోస్ ప్రాంతంలో పదిహెడు వేల రెండు వందల నలభై రెండు పినుజులు కట్టు కేసులొచ్చాయని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా చదరపు కిలోమీటరుకు సున్నా పాయింట్ ఐదు పిరుదులు ఉంటేనే సేఫ్ గా ఉన్నట్టు లెక్క. కానీ క్రాస్నోయార్క్స్ లో ఏకంగా ప్రతి చదరపు కిలోమీటరుకు సగటున రెండు వందల పద్నాలుగు పినుజులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే..  పినుజు కాటు వల్ల మెదడువాపు వ్యాధి వస్తుంది. పిల్లలలో దీని ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. 2015లో దాదాపు లక్షా యాభైవేలమంది పినుజు కాటుతో చనిపోయారు. రష్యాలో తలపించే ఈ పినుజుల్లో మ్యుటేషన్స్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మ్యుటేషన్ అంటే భార్య జన్యు నిర్మాణంలో మార్పు రావడం. కొత్త మ్యూటేషన్ వల్ల ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్ లు రోగిపై పనిచేయక పోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు చాలా ఆసుపత్రుల్లో పినుజుకట్టు చికిత్స చేసే మందుల కొరత నెలకొంది. దీంతో రష్యా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒక వైపు మందుల కొరత నెలకొనడం, పునుజుల్లో మిటేషన్స్ రావడంతో ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా కేసులో టాప్ త్రీలో ఉన్న రష్యాకు ఇపుడు పినుజుల రూపంలో మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.