వెంకటేష్‌ హలో చెప్పట్లేదు

venkatesh-its-not-getting-guest-role-in-akhil-hello-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం ‘హలో’లో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా మూడు నాలుగు రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ‘హలో’ సినిమాలో ఎవరు గెస్ట్‌ రోల్‌ చేయడం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. గతంలో నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్‌’ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌ చేశాడు. ఆ సినిమా సెంటిమెంట్‌ హలోకు వర్తిస్తుందని వెంకీని నటింపజేస్తున్నారు అంటూ అంతా భావించారు. కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఉసూరుమంటున్నారు.

అఖిల్‌ మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో రెండవ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ ప్రముఖ దర్శకుడు ‘ఇష్క్‌’, ‘మనం’, ‘24’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తన కొడుకు సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో నాగార్జున చాలా గట్టి పట్టుదలతో ఉన్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘హలో’ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రముఖ దర్శకుడి కూతురు కళ్యాణి ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నటిస్తుంది. ఈ చిత్రంతో అఖిల్‌ సూపర్‌ హిట్‌ కొట్టి యువ స్టార్‌ హీరోల జాబితాలో చేరతాడో లేదో చూడాలి.