న్యూయార్క్ లో విగ్నేశ్ శివ‌న్ తో న‌య‌న్ సెల్ఫీ

Nayanthara and Vignesh shivan selfie at New York

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌భుదేవాతో ప్రేమాయ‌ణం పెళ్లిదాకా వ‌చ్చి బెడిసి కొట్టిన త‌ర్వాత న‌య‌న‌తార మ‌ళ్లీ చానాళ్లు ప్రేమ ఊసెత్త‌లేదు. సినిమాల‌కు గుడ్ బై చెప్పి… 2012లో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కెరీర్ పైనే ఆమె దృష్టిపెట్టింది. తెలుగు, త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అయితే కొన్నాళ్లుగా న‌య‌న్ పై ఓ పుకారు షికారు చేస్తోంది. ద‌ర్శ‌కుడు విగ్నేశ్ శివ‌న్, న‌య‌న‌తార ప్రేమ‌లో ఉన్నార‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గ‌తంలో శింబు, ప్ర‌భుదేవాతో ఎఫైర్ల‌ను బ‌హిరంగంగా ఒప్పుకున్న న‌య‌నతార‌… విగ్నేశ్ శివ‌న్ విష‌యంలో మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌న మీద వ‌స్తున్న పుకార్ల‌పై న‌య‌న ఇంత‌వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా మీడియా ముందు స్పందించ‌లేదు. కానీ… విగ్నేశ్ తో ఆమె క‌లిసి దిగిన ఫొటోలు మాత్రం అప్పుడ‌ప్పుడూ నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఫొటోనే ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

విగ్నేశ్ 33వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న్యూయార్క్ లోని బ్రూక్లిన్ బ్రిడ్జి ద‌గ్గ‌ర న‌య‌నతార ఆయ‌న‌తో సెల్ఫీ దిగింది. ఆ సెల్పీనే నెట్ లో వైర‌ల్ అవుతోంది. తమిళ్ లో విగ్నేశ్ ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా, గాయ‌కుడిగా, న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార నేనూ రౌడీనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా స‌మ‌యంలోనే వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరిగి ప్రేమగా మారింది. గ‌తంలో ఎంద‌రో హీరోయిన్లు ద‌ర్శ‌కుల‌ను పెళ్లిచేసుకున్నారు. వారి బాట‌లోనే న‌య‌న్ కూడా విగ్నేశ్ శివ‌న్ ను పెళ్లిచేసుకుంటుంద‌ని భావిస్తున్నారు. గ‌త విఫ‌ల ప్రేమ‌ల్లా కాకుండా… ఈ సారి న‌య‌న‌తార ప్రేమ స‌క్సెస్ అవ్వాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార తెలుగులో బాల‌కృష్ణ‌, చిరంజీవి సినిమాల్లో న‌టిస్తోంది.