పవన్‌ను పక్కకు పెట్టేసిన మోడీ

Modi Invites Tollywood Heroes To Swachhata Hi Seva Meeting Except PK

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌తో 2014 ఎన్నికల సమయంలో చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన విషయంలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. కారణం ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజల పక్షంలో పవన్‌ నిలబడి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలంటూ డిమాండ్‌ చేశాడు. దాంతో బీజేపీ ఇప్పుడు పవన్‌ను దూరంగా పెట్టే ఆలోచనలో ఉంది. అందుకే తాజాగా తెలుగు సినీ ప్రముఖులకు లేఖు రాసిన మోడీ, పవన్‌ను వదిలిపెట్టాడు.

వచ్చే నెలలో రాబోతున్న గాంధీ జయంతి సందర్బంగా స్వచ్చత హి సేవ అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఇప్పటికే కేటీఆర్‌కు లేఖ రాసిన మోడీ తాజాగా తెలుగు సినీ దిగ్గజాలు అయిన రాజమౌళి, మోహన్‌బాబు, మహేష్‌బాబు, ప్రభాస్‌లకు లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖలో ప్రధాని స్వయంగా వారిని ఆహ్వానించినట్లుగా ఉంది. దేశం అభివృద్ది చెందాలి అంటే స్వచ్చతగా ఉండాలి అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖలు అందుకున్న వారి సంగతి పక్కన పెడితే అందుకోని పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కారణంగానే మోడీ తమ అభిమాన నాయకుడు, నటుడుని పక్కకు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.