స్వింగ్‌ జరా.. అసలు విషయం దాటేసింది

tamanna-took-60-lakhs-remuneration-for-jai-lava-kusa-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో డాన్స్‌ వేయాలి అంటే అందరు హీరోయిన్స్‌కు సాధ్యం అయ్యేపని కాదు. ఎన్టీఆర్‌ ఎనర్జినీ అందుకోవాలి అంటే ఆస్థాయి ఎనర్జీ ఉన్న హీరోయిన్‌ అయితేనే సెట్‌ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్ది మంది హీరోయిన్స్‌ మాత్రమే మంచి డాన్సర్స్‌. వారిలో తమన్నా ఒకరు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి తన అద్బుతమైన డాన్స్‌తో మెప్పించిన ముద్దుగుమ్మ తమన్నా తాజాగా ఎన్టీఆర్‌కు జోడీగా ‘జై లవకుశ’ ఐటెం సాంగ్‌ను చేసింది. ఆ సినిమాలో స్వింగ్‌ జరా అంటూ తమన్నా చేసిన ఐటెం సాంగ్‌ ఇప్పుడు ప్రేక్షకుల్లో హీట్‌ను పెంచడంతో పాటు, సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

ఎన్టీఆర్‌తో పోటీ పడి మీరీ స్వింగ్‌జరా ఐటెం సాంగ్‌లో అదరగొట్టినందుకు గాను ఈ అమ్మడికి ఏకంగా 60 లక్షల పారితోషికం దక్కినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు లేని ఈ అమ్మడికి ఇంత భారీ మొత్తం పారితోషికం అంటే మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని తమన్నాను మీడియా మిత్రు ప్రశ్నించగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్‌ వంటి గొప్ప నటుడితో, మంచి మనిషితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషం. ఆయనతో సినిమాలో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా వదులుకోను, డబ్బు కోసం డిమాండ్‌ చేయకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకు అసలు విషయాన్ని మాత్రం ఆమె చెప్పకుండా వదిలేసింది.