ఎయిర్ పోర్టులో నేల‌పై ప‌డుకున్న ధోనీ

ms-dhoni-relaxes-on-chennai-airport-floor

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విరామం లేని క్రికెట్ తో అల‌సిపోతున్నాడో ఏమో గానీ..కాస్తంత స‌మ‌యం దొరికితే చాలు…సేద తీరుతున్నాడు క్రికెట‌ర్ ధోనీ. శ్రీలంక‌తో మ్యాచ్ లో మైదానంలో కునుకు తీసి అంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచిన ధోనీ ఇప్పుడు చెన్నై ఎయిర్ పోర్టులో నేల‌పై ప‌డుకున్నాడు. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజ‌యం సాధించిన టీమిండియా రెండో వ‌న్డే కోల్ క‌తా లో ఆడ‌నుంది. అందుకోసం చెన్నై నుంచి కోల్ క‌తా వెళ్లేందుకు ఆట‌గాళ్లంతా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానం రావ‌డానికి కొంచెం ఆల‌స్యం ఉండ‌టంతో ఆట‌గాళ్లంతా ఎయిర్ పోర్టులో ఫ్లోరుపై కూర్చున్నారు. ధోనీ మాత్రం ఆట‌గాళ్ల మ‌ధ్య‌లో ఫ్లోర్ పై ప‌డుకుని సేద‌తీరుతూ క‌నిపించాడు. చెన్నై మ్యాచ్ లో 79 ప‌రుగులు సాధించిన ధోనీ బాగా అల‌సిపోయాడు. దీంతో కాస్త విరామం దొర‌క‌డంతో నేల‌పైనే ప‌డుకుని విశ్రాంతి తీసుకున్నాడు. ధోనీ ప‌క్క‌నే కోహ్లీ, ఇత‌ర ఆట‌గాళ్లు కూర్చుని ఉన్నారు. ఈ ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించ‌డంతో ఆట‌గాళ్లు హాయిగా రిలాక్స్ అవుతున్నారు అని బీసీసీఐ కామెంట్ చేసింది. ధోనీ నేల‌పై పడుకున్న ఫొటోను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ధోనీకి నిద్ర‌పోవ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందుకే ఇలా ప‌డుకున్నాడ‌ని కొంద‌రు, హిప్నాటిజం చేస్తూ రిలాక్స్ అవుతాడ‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.