విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఆ డైరెక్టరే !

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తదుపరి సినిమాల విషయంలో విజయ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందే విజయ్ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు ‘గీతా గోవిందం’ మూవీ కాంబినేషన్‌లో పరశురాం డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్‌కు కమిటైన విజయ్.. తాజాగా మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన్నట్లు సినీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికవే వివిధ జోనర్‌ చిత్రాలు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నసినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు . ఇదిలా ఉండగానే.. ఇప్పుడు దిల్ రాజు, విజయ్‌తో కొత్తగా పాన్-ఇండియన్ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ‘జటాయు’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. లీడ్ యాక్టర్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘జటాయు’ చిత్రంలో VFX వర్క్‌కు భారీ స్కోప్ ఉండటంతో ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. అయితే మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ట్రాక్ ఇప్పటి వరకు ‘లో బడ్జెట్‌’లో మంచి చిత్రాలనే తెరకెక్కించాడు. ఆయన సినిమాల జాబితాలో ‘అష్టా చెమ్మా,సమ్మోహనం, జెంటిల్‌మ్యాన్, గోల్కొండ హై స్కూల్, వంటి సాఫ్ట్ చిత్రాలే ఉన్నాయి. కానీ కథకుడిగా ఎమోషల్ స్టోరీని ప్రజెంట్ చేయడంలో ఆయన ప్రత్యేకత వేరు. కానీ సాఫ్ట్ స్టోరీస్‌తో హిట్లు కొట్టిన ఇంద్రగంటి.. విజయ్‌‌తో పాన్ ఇండియా రేంజ్ సినిమాకు న్యాయం చేయగలడా? అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.
అయితే, దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కమిట్ అయ్యాడంటే తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా కథలో దమ్ముండే ఉంటుంది. పైగా ‘జటాయు’ అనే టైటిల్ కూడా ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ కలిగిస్తోంది.