పునర్జన్మల నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ “కంగువ “

Suriya
Suriya

ఈ మధ్య కాలంలో వచ్చిన ‘PS (పొన్నియిన్ సెల్వన్)’ తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా చూసిన సూరియా అభిమానులు, తమ హీరో కూడా అందులో ఉంటే బాగుండునని అనుకున్నారు. వాళ్ల ముచ్చట తీర్చడం కోసం అన్నట్టుగా ‘కంగువ’లో సూరియా యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. తాజాగా వదిలిన గ్లింప్స్ చూసి, ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇది యాక్షన్ సినిమా అనే విషయం పోస్టర్ల దగ్గర నుంచే అందరికీ అర్థమైపోతోంది. అయితే ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ వెనుక, పునర్జన్మల నేపథ్యం ఉందని చెబుతున్నారు. అంటే ఈ కథ గతంలోనూ .. వర్తమానంలోను కొనసాగుతుందన్న మాట. అందువలన సూరియా పాత్రలో వేరియేషన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నారు. మొట్ట మొదటి సారిగా ఈ స్థాయి బడ్జెట్ లో సూరియా సినిమా నిర్మితమవ్వడం విశేషం . స్టూడియో గ్రీన్ – యూవీ క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 10 భాషల్లో .. 3D వెర్షన్ లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు