అది బాటిల్ ఓపెనరని, డైమండ్ రింగ్ కాదని అసలు విషయాన్ని చెప్పిన తమన్నా

Tamannaah Bhatia
Tamannaah Bhatia

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తమన్నా భాటియా కొన్నాళ్లుగా సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో బోల్డ్‌ క్యారెక్టర్స్ చేయడం ప్రారంభించిన తమన్న, నటుడు విజయ్ వర్మతో తన ప్రేమ గురించి వెల్లడించింది. ఇప్పుడు తను మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి విజయ్‌తో డేటింగ్ పుకార్ల గురించి కాదు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని వార్తలొచ్చాయి . మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డిలో అద్భుతంగా నటించినందుకు తమన్నాకు ఉపాసన ఈ రింగ్‌ ను బహుమతిగా ఇచ్చిందంటూ నెట్‌లో చర్చ మొదలైంది. అయితే, ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది ఓ బాటిల్ ఓపెనర్‌‌ అని, డైమండ్ రింగ్ కాదని ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌ స్టా గ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది.