కేరళకు విజయ్‌ సాయంపై క్లారిటీ…!

Vijay Donation 70Lacks Kerala Victims

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కేరళ వరద బాధితుల సహాయార్థం ఏకంగా 14 కోట్లను విరాళంగా ప్రకటించాడు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఏ సౌత్‌ హీరో కూడా కనీసం కోటి విరాళం ప్రకటించలేదు. అలాంటిది విజయ్‌ ఏకంగా 14 కోట్లను విరాళంగా ఇవ్వడం గొప్ప విషయం అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపించారు. అయితే అదంతా పుకార్లు అని, విజయ్‌ అభిమానులు కొందరు కావాలని ఈ ప్రచారంను మొదలు పెట్టారు అంటూ తేలిపోయింది. విజయ్‌ ఈ చిత్రం కోసం ప్రకటించిన మొత్తంపై తాజాగా ఆయన పీఆర్‌ టీం క్లారిటీ ఇచ్చింది. విజయ్‌ 14 కోట్ల విరాళంను ప్రకటించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, విజయ్‌ గురించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ నమ్మొద్దు అంటూ ప్రకటన వెలువడినది.

vijay

విజయ్‌ తాజాగా తన అభిమానులతో కలిసి కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళంను ప్రకటించడం జరిగింది. 70 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లుగా విజయ్‌ ప్రకటించాడు. అభిమానులు కొందరు చేస్తున్న ప్రకటనలు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో పుకార్లు ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ విజయ్‌ పీఆర్‌ టీం కోరుతుంది. సినిమాల గురించి పుకార్లు ప్రచారం చేయడం ఏమో కాని, ఇలా సున్నితమైన విషయాల గురించి కొందరు కావాలని పుకార్లు సృష్టించి విజయ్‌ను అగౌరవ పరుస్తున్నారు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌత్‌ సినీ హీరోల్లో అత్యధికంగా కేరళకు విరాళం ప్రకటించిన హీరోల్లో విజయ్‌ ముందు ఉన్నాడు. విజయ్‌ మంచి మనసును ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

kerala