మొదటి రోజు షేర్‌ అంతా వరద బాధితులకే…!

Geetha Govindam Earnings In Kerala To Be Donated To Flood Victims

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు ఊహకందని వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా 10 కోట్ల షేర్‌ను దక్కించుకుని సంచలనం సృష్టించింది. విజయ్‌ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ ఏంటో ఈ వసూళ్లతో తేలిపోయింది. ఇక ఓవర్సీస్‌ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేస్తుంది. కేరళలో ఒక వైపు వరదలు ముంచెత్తుతున్నా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. కేరళలో ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 10 లక్షలకు పైగా షేర్‌ను రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఆ మొత్తంను కూడా కేరళ వరద బాధితులకు ఇస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించాడు.

BANNI

కేరళలో ‘గీత గోవిందం’ చిత్రంకు వచ్చిన మొదటి రోజు కలెక్షన్స్‌ మొత్తం కూడా వరద బాధితులకు ఇస్తున్నాం అంటూ నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు. అల్లు అరవింద్‌తో కలిసి ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌ 25 లక్షలు కేరళకు సాయంగా ప్రకటించాడు. ఇప్పుడు బన్నీ వాసు మరో భారీ మొత్తంను వరద బాధితులకు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. బన్నీ వాసుపై ప్రశంసల జల్లు కురుస్తుంది. నిర్మాతలు ఎవరు కూడా ఇప్పటి వరకు కేరళకు సాయం ప్రకటించింది లేదు. మొదటి అడుగుగా బన్నీ వాసు ముందు ప్రకటించడం అభినందనీయం. బన్నీకి ఆప్త మిత్రుడు అయిన బన్నీ వాసు ఆయన దారిలోనే భారీగా సాయంను ప్రకటించడం జరిగింది. ఇక గీత గోవిందం చిత్రంలో నటించిన విజయ్‌ దేవరకొండ ఇప్పటికే 5 లక్షల సాయంను కేరళ వరద బాధితులకు చేయడం జరిగింది. హీరోయిన్‌ కూడా తనవంతు సాయంను ప్రకటించింది.

producer bunny