అప్పుడు అక్కతో, ఇప్పుడు చెల్లితో..!

‘మజ్ను’ చిత్రంతో అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. నానితో నటించిన ఆ చిత్రం అనుకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. అయినా కూడా అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. పవన్‌ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసిలో అవకాశం దక్కించుకున్న అను ఎమాన్యూల్‌ స్టార్‌ అవ్వడం ఖాయం అనుకున్నారు. కాని ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. తర్వాత అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చిత్రంలో నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యింది. ప్రస్తుతం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో ఈమె నటించింది. సక్సెస్‌ లేకున్నా అవకాశాలు దక్కించుకుంటున్న అను ఎమాన్యూల్‌ కెరీర్‌ ఇంకా స్థిరపడకుండానే ఆమె కజిన్‌ రెబ్బా మోనిక తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Anu Emmanuel Sister  Reba Monica John

నాని నటించిన మజ్ను చిత్రంతో అను పరిచయం అవ్వగా, ఇప్పుడు మళ్లీ నానితోనే రెబ్బా మోనిక పరిచయం కాబోతుంది. నాని ప్రస్తుతం గౌతమ్‌ దర్శకత్వంలో ‘జర్సీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న జెర్సీ చిత్రంలో ఒక హీరోయిన్‌గా మోనిక రెబ్బాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మోడల్‌గా కొన్నాళ్లుగా చేస్తున్న మోనిక రెబ్బా హీరోయిన్‌గా జర్సీ చిత్రంతో పరిచయం కాబోతుంది. అను ఎమాన్యూల్‌కు కజిన్‌ అయ్యే మోనిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ మేరకు సక్సెస్‌ను దక్కించుకుంటుందో చూడాలి.

 Anu Emmanuel With Her Sister Reba Monica John