కేరళ విపత్తు వల్ల లాభం ఎవరికి??

Kerala fights to get back on feet

కేరళ కోసం ఇందరు సహాయం చేస్తున్నారుగా  అసలు సహాయం నిజంగా భాదితులకి చేరుతుందా ?? ఇన్ని ఇన్ని ఎకౌంటు నెంబర్లు , ఎవరికి వారు డబ్బాలు పట్టుకుని తిరగడం డబ్బా కొట్టుకోవడం కోసమేనా?? ఇల్లాంటి సమయంలోనే నల్లధనం తెల్లధనం అవుతుందా ??నల్లధనమ్ తెల్లదనంగా ఈ రకంగా మారినా కొంత మంచిదే కదా , అది భాదితుడికి చేరితే … అలా  కాకుండా సొంత ఎకౌంటు నెంబర్లు ఇచ్చి వాళ్ళ నిధుల నిలువలను ఇంకా పెంచుకునే వాళ్ళు ఉన్నారు ..అసలు జరిగిన నష్టం ఎవరికి ?? కేంద్ర ప్రభుత్వనికా ?? రాష్ట్ర ప్రభుత్వనికా ?? సామాన్య మానవునికా ?? కొంచెం తరచి చూస్తే ఏ విపత్తు వచ్చినా నష్ట పోయేది సామాన్యుడే … కూడు కలిగి , నీడ కలిగి , తోడు కలిగి అన్ని ఒక్కసారిగా కోల్పోతే ?? ఊహించని కష్టం …ఈ కష్టం నుండి బయట పడేయడానికి మానవత్వం ఉన్న సాటి మనుషులు ఎందరో చేయి అందిస్తూ , చేయూత నిస్తూ మానవత్వం ఇంకా మిగిలి ఉంది చూడమంటూ నిరూపిస్తున్నారు … సంధట్లే సడే మియాలు దొరికిందే అవకాశం అని పందికొక్కుల గుణం చూపించేవారు మరి కొందరు .

కేరళ విపత్తు వల్ల లాభం ఎవరికి?? - Telugu Bulletప్రభుత్వం రోడ్లు  , కమ్యూనికేషన్ వ్యవస్థలు  బాగు చేయడం భాదిత కుటుంభాలకు కొంత నష్టపరిహారం ఇవ్వడం వరకు చేస్తాయి ..మరి సర్వం కోల్పోయిన భాదితుడిని ఎవరు ఆదుకుంటున్నారు ?? వారి పరిస్థితితో ఎవరు ఆడుకుంటున్నారు ?? ఈ పరిస్థితిని ఆర్ధికంగా, రాజకీయంగా ఎవరు వాడుకుంటున్నారు ??ఆడవారికి కావసిన సానిటరీ నాప్కిన్లు పంపిస్తున్నారు అనే విషయంలో కండోమ్స్ కూడా పంపించాలి అని వెకిలితనం చూపించి తన యాజమాన్యం చేత చీ కొట్టించుకున్న మనుషులు ఉన్నారు ,  సంభంధం లేని వేరే దేశ రాజు కేరళ పరిస్థితి  చలించి పెద్ద మొత్తంలో సహాయం చేసే ఉదాత్తులు ఉన్నారు … అడల్ట్ స్టార్ అయిన సన్నీ లియోన్ లాంటి నటులు కొట్లలో సహయం అందిస్తే , వంశం , పరువు , పొగరు అని మాట్లేడే వీరులు అందరు కలిసి కోటికి చేరుకోలేని వారు ఉన్నారు.

Kerala floods,Kerala floods 2018,Kerala flood

సమస్య ఎప్పుడు మంచిదే .. మనిషి లోని అసలు రంగును పరిచయం చేస్తుంది , ముసుగులని తోలగిస్తుంది.. మానవత్వాన్ని తట్టి లేపుతుంది .. అందుకే మనకు కనీసం ముఖ పరిచయం లేని వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాం , సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం , వాళ్ళ బాగుండాలి అని అనుక్షణం ప్రార్ధిస్తూ ఉన్నాం ..ముందుగా వాళ్లకు కావసినిది సురక్షిత నీరు , ఆహారం ,కట్టుకోవడానికి బట్టలు , వ్యాధుల బారిన పడకుండా మందులు, ఇవ్వి అందరూ అందిస్తున్నారు కానీ మల్లి ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నింపి , ప్లాస్టిక్ బాటిల్లో నీటిని అందిస్తే ఇక మనం ఏం నేర్చు కున్నట్లు ?? ఏం మారినట్లు ??