మెగా హీరో కోసం హీరోని విలన్ని చేస్తున్నారు !

Vaishnav-Tej

సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో జాలరుల కుటుంబానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఈ మధ్య సుకుమార్, బుచ్చిబాబులు తమ టీంతో వెళ్లి మరీ విజయ్ ని కలిసి వచ్చారు. దీంతో ఈ వార్తలకి మరింత బలం చేకూర్చినట్టు అవుతోంది. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఈ సినిమాతో ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ ఆయన బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన సైరాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.