జగన్ నిర్ణయం స్వాగతిస్తున్న విశాఖ టీడీపీ నేతలు

జగన్ నిర్ణయం స్వాగతిస్తున్న విశాఖ టీడీపీ నేతలు

జగన్ ఏకపక్ష నిర్ణయాలకు ప్రతిపక్షాలు ఆమోదం తెలిపేలా వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ప్రతిపాదించిన జగన్ తుది నిర్ణయాన్ని ప్రకటించేలోపు మంత్రుల, ఎమ్మెల్యేల, ప్రజల మద్దతు కూడగట్టుకొనే అవకాశం జగన్ కి వుంది. అభివృద్ధి వికేంద్రీకరణ తో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక సైతం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విశాఖ టీడీపీ నేతలు జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నారు.

సంక్షేమ పథకాలు సకాలంలో అమలయ్యేలా చూస్తూనే, ప్రజలని ఆకర్షించేందుకు కొత్త పథకాల్ని ప్రవేశపెడుతూ, ఇతర పార్టీలకంటే బిన్నంగా ప్రజల గుండెల్లో తనదైన శైలిలో ముద్ర వేస్తున్నారు జగన్. అమరావతి ప్రాంతం ఎమ్మెల్యే ల నుండి కొంత వ్యతిరేకత ఏర్పడిన, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ నిరూపిస్తే అమరావతి వాసుల హృదయాల్ని గెలిచినట్లే. కర్నూల్ లో హైకోర్టు ని పెట్టాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇటు మూడు ప్రాంతాలలో జగన్ అభివృద్ధికి బావుటాలు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఏకకాలంలో విపక్షాలు గగ్గోలు చేసేందుకు వీలు లేకుండా రాజధాని ఫై తుది నిర్ణయాన్ని అందరికి ఆమోదయోగ్యమయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు జగన్. మరి జగన్ అడ్డంకులు లేకుండా తన పని పూర్తీ చేస్తాడో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.