మా ఊళ్లో క్వారంటైన్ కేంద్రం వద్దు… అంతే… పోలీసులపై పల్లెవాసుల దాడి

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా అంటేనే భయపడుతుంది. అసలు ఆ పేరు వినబడితేనే కంపరం లేస్తుంది. అలాంటిదే తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ ఘటన జరిగింది. అదేమంటే.. త‌మ ఊరిలో క్వారంటైన్ కేంద్రం నిర్వ‌హిస్తున్నందుకు పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామ ప్ర‌జ‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పోలీసులపై ఇప్పటికే రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు.

కాగా క‌రోనా పాజిటివ్‌గా తేలిన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స నిర్వ‌హిస్తార‌. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే 14 రోజుల ఐసోలేష‌న్ తర్వాత నెగిటివ్‌గా తేలితే ఆయా వ్య‌క్తుల‌ను అక్కడ నుంచి ఇంటికి పంపించేస్తారు. అయితే త‌మ గ్రామ స‌మీపంలో క్వారంటైన్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్నందుకు పోలీసుపై గ్రామ‌స్తులు రెండుసార్లు దాడికి దిగారు. ఈ దాడుల్లో సీనియ‌ర్ ఆఫీస‌ర్ స‌హా 20 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని ప‌శ్చిమ బుర్ద్వాన్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవడం విశేషం.

అయితే జిల్లాలోని చురులియా గ్రామంలో ఈ మధ్య అధికారులు క్వారంటైన్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. క‌రోనా పాజిటివ్ సోకిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే త‌మ ఇంటి వ‌ద్ద ఈ కేంద్రాన్ని ఉంచ‌డంతో ఆందోళ‌నకు దిగిన గ్రామస్తులు గత ఆదివారం నుంచి ఆందోళ‌న చేస్తూనే ఉన్నారు. తాజాగా పోలీసుల‌పై రెండుసార్లు దాడి చేశారు. త‌మ ఊరి నుంచి దూరంగా ఈ కేంద్రాన్ని త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదన్నమాట.. దీనంతటికీ కారణం కరోనా అంటే ప్రజలకు ఎంత భయమో చూడండి. కాగా ఇప్పటివరకు బెంగాల్లో 190 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఏడుగురు ఈ మ‌హ‌మ్మారి బారిన పడి మృతి చెందారు.