టైగర్-3లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో..?

టైగర్-3లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో..?
Cinema News

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హృతిక్ రోషన్​తో కలిసి వార్-2లో నటిస్తారని ఇన్నాళ్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా కంటే ముందే మరో స్టార్ హీరో మూవీతో ఎన్టీఆర్ బీ టౌన్​ ఎంట్రీ ఉండనుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.?

టైగర్-3లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో..?
Junior NTR

దీపావళి రోజున విడుదలవుతున్న సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ మూవీ టైగర్-3లో తారక్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కామియోల గురించి చాలా వార్తలొచ్చాయి. ఈ సినిమా లో పఠాన్‌గా షారుక్‌ ఖాన్‌, మేజర్‌ కబీర్‌ ధలీవాల్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నారంట . అయితే ఈ మూవీ తోనే ఎన్టీఆర్‌ని కూడా పరిచయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరో 24 గంటలు వేచి ఉండాల్సిందే. మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్‌ 3’లో ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలో నటించాడు.