Election Updates: నేడు తెలంగాణలో నామినేషన్ చివరిరోజు…అప్ డేట్లు

Election Updates: Today is the last day of nomination in Telangana...updates
Election Updates: Today is the last day of nomination in Telangana...updates

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, నేడు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు ముగిసిపోతుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బీ- ఫాంలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తామని చెప్పుకొచ్చింది. ఇక, ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయడంతో పాటు ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. ఇక, 30వ తేదీన పొలిం గ్‌ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న (గురువారం ) నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. కాం గ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం , బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన క్యాండిడేట్స్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు సమర్పించారు.

చివరి రోజు కావడంతో ఈరోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు అం దజేస్తారు. ఈసారి రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ సభ నిర్వ హించనున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 6న కొడంగల్ లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. తెలంగాణలోని నవంబర్ 30వ తేదీన 119 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ జరగనుంది.