లాక్ డౌన్ వేళ… పోలీసులు వెంటాడటంతో తుళ్లూరు వాసి మృతి

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు భయపడి పొలాల వైపు పరుగెత్తాడు. కానిస్టేబుల్ వెంటపడడంతో వేగంగా పరిగెత్తలేక అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన జాఫర్ అనే వ్యక్తి పోలీసులకు దొరక్కుండా పారిపోయే ప్రయత్నంలో కుప్పకూలి చనిపోయాడు.

రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన షేక్ జాఫర్(55) స్నేహితులతో కలసి బయటికి వచ్చినల్లు సమాచారం అందుతుంది.
లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రాసమయంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో అదే సమయంలో పోలీసులు రాయపూడి చేరుకున్నారు. ఒక్కసారిగా పోలీసులను చూసి గ్రామస్థులు పొలాల్లోకి పరుగులు తీశారు. బయట ఎందుకు తిరుగుతున్నారంటూ కానిస్టేబుల్ రామయ్య గ్రామస్థుల వెంటపడడంతో భయంతో పరిగెడుతూ జాఫర్ కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.