ఓటీటీలోకి ‘గాండీవధారి అర్జున’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘గాండీవధారి అర్జున’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Latest News, Movie News

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస మూవీ లు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 25న బాక్సాఫీసు ముందుకొచ్చి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మూస ధోరణిలో ఉన్న సినిమా స్టోరీ వరుణ్ అభిమానులనూ ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఎలా వచ్చిందో అలాగే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది.

ఓటీటీలోకి ‘గాండీవధారి అర్జున’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Varun tej

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్​కు రెడీ అవుతోంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఒక పోస్టర్‌ విడుదల చేసింది. ‘సెప్టెంబరు 24న రానున్నది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఒక ఏజెంట్‌ తెచ్చే ధైర్యం కూడా’ అని పేర్కొంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా లండన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో వరుణ్‌ బాడీగార్డ్‌గా కనిపిస్తారు. ఆయన సరసన సాక్షి వైద్య నటించింది. నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.