గూడ్స్‌ షెడ్‌ రోడ్డులో దారుణ హత్య

గూడ్స్‌ షెడ్‌ రోడ్డులో దారుణ హత్య

కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గూడ్స్‌ షెడ్‌ రోడ్డులో దారుణ హత్య జరిగింది. భార్య పుణ్యవతిని భర్త సంతోష్‌ గొంతు నులిమి హత్య చేశారు. మే నెలలో పుణ్యవతిని సంతోష్‌ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.

గత రాత్రి నుంచి ఇంటికి తాళం​ వేసి ఉండటంతో అనుమానంతో పుణ్యవతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరచి చూడగా అప్పటికే పుణ్యవతి మృతిచెందినట్లు గుర్తించారు.