కామాంధుడిని గదికి రమ్మని పురుషాంగం కత్తిరించిన యువతి

ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లిపోతుంది. కరోనా వైరస్ భయం సమాజాన్ని పట్టి పీడిస్తోన్నా.. లైంగిక వేధింపులు మాత్రం అస్సలు తగ్గడం లేదు. నిర్భయ, దిశ వంటి ఘటనలు, కఠినమైన శిక్షలు వచ్చినప్పటికీ.. మనిషి కామం విషయంలో రాక్షసుడైపోతున్నాడు. ఒంటరి మహిళ రోడ్డుపై నడిచేందుకు భయపడిపోతుంది. ఎలాగైనా వారిని లోబరుచు కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ముంబైలో ఓ ఒంటరి యువతిపై కన్నేసిన వ్యక్తి కోరిక తీర్చాలంటూ ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందో లేదోనని ఆమె అనుమానించింది. వెంటనే తన్ను తాను ఆత్మ రక్షణలో సరైన బుద్ధి చెప్పింది. అదిరిపోయే ప్లాన్ వేసింది. అదేమంటే.. ముంబైలోని డోంబివిలీ ప్రాంతానికి చెందిన తుషార్ పుజారా(27) అనే ఆకతాయి అమ్మాయిలను వేధిస్తుండేవాడు. రోజూ వెంట పడుతూ కోరిక తీర్చాలని పోరాడుతున్నాడు. రోజూ ఆఫీసు నుంచి తన ఇంటికి వెళ్లే సమయంలో యువతిని అడ్డగించి ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగికంగా వేధించసాగాడు. తనకు ఇష్టం లేదని అనేకమార్లు తెలిపింది. వెంట పడొద్దని స్పష్టం చేసింది. అందుకు తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ కామాంధుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని యువతి నిర్ణయించుకుంది.

ఎంతో విసుకుచెందిన స్థానిక అమ్మాయి…. ఓ ప్లాన్ ప్రకారం అతడికి ఫోన్ చేసి ఫలానా చోటికి వస్తే కోరిక తీరుస్తానని చెప్పింది. దీంతో తుషార్ ముందూ వెనకా ఆలోచించకుండా ఆమె చెప్పిన చోటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. గదిలోకి వెళ్లగానే ఇద్దరు భారీకాయులు అతడిని పట్టుకుని బంధించారు. అక్కడే ఉన్న యువతి నన్నే వేధిస్తావా? అంటూ తుషార్‌ను చితక బాదింది. అతడి ప్యాంట్ విప్పి పదునైన కత్తితో పురుషాంగాన్ని కోసేసింది. తుషార్ బాధతో కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో యువతితో పాటు ఆ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.