చైనాలో మళ్లీ స్టార్ట్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. అయితే కరోనా కారణంగా చైనాలో ఆహార మార్కెట్లను జనవరి నుంచి పూర్తిగా మూసి వేశారు. అయితే అసలు కరోనాకు కారణమైన ఆహార మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. ఎక్కడైతే కరోనా పుట్టిందని ప్రపంచమంతా ఘోషిస్తుందో అక్కడ యధావిధిగా కార్యకలాపాలకు చైనా అనుమతిచ్చింది. అయితే చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ… అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి రెడీ అయ్యాయి.

అయితే చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆహార మార్కెట్లలో కబేళాలకు మూగ జీవాలు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న ఉద్దేశంతో ఈ జనవరిలో చైనాలో ఆహార మార్కెట్లనుమూసివేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వైరస్‌ను విజయవంతంగా అడ్డుకున్నామని చైనా ప్రకటించి తిరిగి యథావిథిగా మార్కెట్లను ప్రారంభించింది.

ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో తిరిగి మళ్లీ చైనా ఫుడ్‌ మార్కెట్లు తెరవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కరోనావైరస్‌కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి అదేరీతిగా పనిచేస్తున్నాయని డైలీమెయిల్‌ వెల్లడించింది. అయితే ఎవరినీ ఫోటోలు తీసుకొనేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని.. ఫోటోలు తీసుకొనే వారిని సెక్యూరిటీ గార్డులు అడ్డగించడం జరుగుతుందని తెలిపింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్‌ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు దర్శనమిస్తోందని కూడా పేర్కొనడం విశేషం.

కాగా చైనాలో తిరిగి స్టార్ట్ అయిన ఫుడ్ మార్కెట్లలో చైనా సంప్రదాయ ఆహారంపై సోషల్‌ మీడియాలో ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక కోవిడ్‌-19ను అధిగమించామని చైనా చెబుతున్నా పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించిన వైరస్‌ లెక్కలను తప్పులు తడకలుగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది.