మరో దిశ వంటి ఘటన…. పోలీసులు ఇలా

గతనెల 17వ తేదీన మరో దిశవంటి ఘటన హైదరాబాద్ శివార్లలో జరిగిన విషయం తెలిసిందే. నగ్నంగా ఓ మహిళను హత్య చేసి బ్రిడ్జ్ కింద పడేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో గత సంవత్సరం జరిగిన ఘటన వలెనే ఈ దారుణ ఘటన కూడా చోటుచేసుకుంది. అదే తరహాలో తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జికింద యువతిని బండ రాయితో కొట్టి హత్య చేసిన ఘటనలో పోలీసులకు విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లుగా ఆనవాళ్లు లభించాయి.

అయితే ఈ హత్యకు గురైన యువతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయి ఉండొచ్చని అప్పట్లో అంతా భావించారు. వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. అప్పటి నుంచి దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి.
అలాగే.. ఆ సమయంలో ఆమె శరీరంపై దుస్తులు లేకపోవడం.. బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యచేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు.

అయితే ఆమె సిక్కింకు చెందిన వివాహితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారని.. ఫేస్ బుక్ లో పరిచయమైన ఓవ హైదరాబాద్ యువకుడి కోసం వచ్చినట్టు వెల్లడైంది. బంధువుతో కలిసి తనతో బతికేందుకు వచ్చిన ఆ మహిళను తన బంధువుతో కలిసి ప్రియుడు హత్య చేసినట్లు తెలిసింది. కాగా సిక్కింలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు కాగా.. మృతురాలి శరీరం పై ఉన్న ఆభ రణాల ఆధారంగా సాగిన దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు