108 ఎంపీ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌

108 ఎంపీ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌

ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌లలో చైనా మొబైల్‌ దిగ్గజం షావోమి నాలుగవ స్థానం లో ఉంది. అయిదు కెమెరాలతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో  స్మార్ట్‌ ఫోన్‌ ను అందుబాటులో తీసుకురానుంది. నెంబర్‌వన్ బ్రాండ్‌గా దేశంలో షావోమి కొనసాగుతున్నది. భారీ కెమెరాతో ప్రపంచంలోనే  తొలి సారిగా స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతున్నది.

ట్విటర్‌లో  ఫోటోను షేర్‌ చేస్తూ స్మార్ట్‌ ఫోన్ల కెమెరాలలో కొత్త శకం ప్రారంభం కానున్నదని ట్వీట్‌ చేసింది. స్మార్ట్‌ ఫోన్ల పేర్లు ఎంఐ నోట్‌ 10, ఎంఐ నోట్‌ 10ప్రొ గా ప్రకటిస్తూ వినియోగ దారులకి అందు బాటులోకి తీసుకు రానున్నది. అద్భుతమైన ఫీచర్లతో ఇంకా విభిన్న ప్రాసెసర్‌లతో రానున్నది. ఎంఐ సీసీ9ను చైనాలో నవంబరు 5న  లాంచ్‌ చేస్తున్నట్టు టీజర్‌ను విడుదల చేసింది. 855‍ సాక్‌ ప్రాససర్‌ను ఎంఐ నోట్ 10 ఫ్లాగ్‌ షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ కు అమర్చినట్టు సమాచారం.