అత్యుత్తమ ర్యాంక్ లో ఫెడరర్‌

అత్యుత్తమ ర్యాంక్ లో ఫెడరర్‌

స్విట్జర్లాండ్కి చెందిన ప్రముఖ టెన్నిస్  క్రీడాకారుడు రోజర్‌ ఫెడరర్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు. ఇప్పటి వరకు 20 గ్రాండ్‌ స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకున్న ఘనత ఫెడరర్‌దే. ఈ స్విట్జర్లాండ్‌ దిగ్గజం పదోసారి స్విస్‌ ఇండోర్స్‌ ఓపెన్‌ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు

తన ఆధిపత్యాన్ని సొంత గడ్డపై చాటుకుంటూ ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌ తో జరిగిన ఫైనల్ లో ఫెడరర్‌ గెలిచాడు. 6 –2, 6–2తో గెలిచిన ఫెడరర్‌ కెరీర్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ 103కు చేరింది. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్‌ చేస్తూ విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు ఇంకా ప్రైజ్‌మనీగా 430125 యూరోలు 3 కోట్ల 37 లక్షలు రూపాయలు రానున్నాయి.