అవును వాడుకున్నా…కావాలంటే డబ్బు కడతా : కోడెల

several-twists-in-the-case-of-furniture-theft

ఏపీ అసెంబ్లీలో ఫర్నిచర్‌, ఏసీల మాయం వెనక తన హస్తముందన్న ఆరోపణలపై స్పందించారు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు. హైదరాబాద్‌ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలిస్తుండగా సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్‌ తాను వినియోగించుకున్నట్టు ఒప్పుకున్నారాయన.

గతంలో అనేకసార్లు అసెంబ్లీ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు రాసి… ఫర్నిచర్‌ తీసుకుని వెళ్లాలని సూచించినట్టు చెప్పారాయన. కానీ దానికి వారి నుంచి ఎలాంటి స్పందన లేదని…  అధికారులు వస్తే ఫర్నిచర్‌ అప్పగిస్తానని.. లేదంటే ఎంత ఖర్చు అయిందో చెబితే చెల్లిస్తానని చెప్పుకొచ్చారు కోడెల.