తరుణ్ కాదు…రాజ్ తరుణ్ కి యాక్సిడెంట్ స్వల్పగాయాలు

Not Tarun..Hero Raj Tharun met with accident

గత రాత్రి ఔటర్ రింగ్ రోడ్డ్ పై యాక్సిడెంట్ అయిన కారులో ఉన్నది హీరో తరుణ్ కాదని, మరో హీరో రాజ్ తరుణ్ అని తేలింది. కారు యాక్సిడెంట్‌కు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను పరిశలించిన పోలీసులు కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తేల్చారు.

ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడిన రాజ్ తరుణ్, పరుగులు తీస్తూ మరో కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు. అయితే రాజ్ తరుణ్‌ను చూసిన కొందరు.. అతని పేరు తరుణ్ అని పేర్కొనడంతో… మీడియా కూా పొరపాటుతో హీరో తరుణ్ ఫోటోల్ని ప్రసారం చేసింది.

దీనిపై తరుణ్ కాసేపటి క్రితం వివరణ ఇచ్చాడు కూడా.తన కారు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని.. తాను కూడా రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నానని మీడియాకు తెలిపాడు.

ఇక కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తేలడంతో, ఇప్పుడు అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియలేదు.

రాజ్ తరుణ్‌ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడన్న విషయమై పోలీసులు  సమాచారం సేకరిస్తున్నారు.