‘చంద్రబాబు కొంప మునగటానికి వీల్లేదు.. జనాలు బలి కావాలట’

chandrababu-housecan-not-be-drowned-sacrificing-people

అమరావతి కేంద్రంగా వరద రాజకీయం ముదురుతోంది. చంద్రబాబు నివాసంపై వైసీపీ-టీడీపీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బాబు ఇంటిని ముంచేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీఆరోపిస్తుంటే.. కరకట్టకు వరద ప్రమాదం ఉందని, ఇల్లు ఖాళీ చేయమని హెచ్చరించినా బాబు పట్టించుకోలేదని వైసీపీ కౌంటరిస్తోంది. ఈ వివాదంపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. చంద్రబాబు టార్గెట్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ బాంబులు పేలుస్తున్నారు.

‘ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం,బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు’అంటూ ఆరోపించారు.

‘అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు తీసేసిన తాసిల్దార్లు’అంటూ చురకలంటించారు.