వేధింపులు తట్టుకోలేక యువకుడి సూసైడ్

వేధింపులు తట్టుకోలేక యువకుడి సూసైడ్

అవసరం తీర్చుకునేందుకు అప్పు చేస్తే అది చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. సాయి కృష్ణ అనే యువకుడు ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.. సాయి కృష్ణ కొద్దిరోజుల కింద ఫైన్సాన్స్ తీసుకొని హోండా యాక్టివా వాహనాన్ని కొనుగోలు చేశాడు..

అయితే కరోనా కాలంలో చెల్లించాల్సిన ఫైన్‌ను చెల్లించాలని సాయి కృష్ణపై ఒత్తిడి చేశారు ఫైనాన్సర్లు.. ఈ క్రమంలోనే సాయి కృష్ణ పని చేస్తున్న షాపునకు వచ్చి హోండా యాక్టివా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు.. ఇటు సాయి కృష్ణ తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఇప్పుడే చెల్లించాలంటూ ఫైనాన్సర్లు బెదిరింపులకు దిగారు. దీంతో సాయి కృష్ణ తల్లి అప్పు కోసం బయటికెళ్లింది..

ఈ క్రమంలోనే అవమానం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్షర్లు ఇబ్బందులు పెట్టడం వల్లే తమ కొడుకు చనిపోయాడని సాయి తల్లిదండ్రులు ఆవేదన చెందారు.. చేతికందిన కొడుకు ప్రాణం తీసుకోవడంతో గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..