డౌట్ లేదు. రోజాది ఐరన్ లెగ్గే

YSRCP MLA Roja sensational comments on AP CM Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తేలిపోయింది. మరోసారి రోజా ఐరన్ లెగ్ అని ప్రూవ్ అయింది. ఆమె దురహంకారం కారణంగా నంద్యాలలో మహిళలంతా మూకుమ్మడిగా ఓట్లేసి భూమా బ్రహ్మానందరెడ్డికి విజయం కట్టబెట్టారు. అందుకే మీడియాకు ముఖం చాటేసింది ఫైర్ బ్రాండ్. కాకినాడలో కూడా ఇల్లిల్లూ తిరుగుతూ చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదని రోజా చేస్తున్న ప్రచారం సగటు ఓటరుకు వెగటు పుట్టించింది.

రోజాకు రాజకీయ పునాది వేసింది చంద్రబాబు. అప్పట్లో టీడీపీలో ఉండి వైఎస్, కేసీఆర్ ను తెగతిట్టిన రోజా.. అదే నోటితో వైఎస్ ను పొగుడుతూ పూల బొకే ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్ పంచన చేసిన రోజా.. ఆయనకు కావల్సినన్ని తప్పుడు సలహాలు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రచారంలో రోజై హైలైట్ చేసే అంశాలు నెగటివ్ అవుతున్నాయి.

జరుగుతున్న అభివృద్ధిని కూడా జరగలేదని ప్రచారం చేయడం, చిన్నా, పెద్దా లేకుండా మాట్లాడటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. రోజా లాంటి అనుభవం లేని నేత, చంద్రబాబు లాంటి సీనియర్ చేస్తున్న అన్ని పనులూ విమర్శించడం, దానికి లాజిక్ లేకపోవడం జనం గమనించారు. పబ్లిసిటీ కోసం రోజా చీప్ స్టంట్లు చేస్తోందని జనం గుర్తించడంతో.. వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టారు.

మరిన్ని వార్తలు:

ఆప్ కి పూర్వవైభవం వచ్చినట్లేనా..?

ప‌దేళ్ల జైలు శిక్ష‌… క‌న్నీరు పెట్టుకున్న డేరా బాబా

ఇది సోష‌ల్ మీడియాపై గెలుపు కూడా….