ఆ ఎమ్మెల్యే.. కరోనాతో బర్త్ డే రోజే మృతి

కరోనా వైరస్ ఎంత తీవ్రతరంగా విజృంభిస్తుందో చెప్పడానికి తాజాగా ఎమ్మెల్యే మరణమే ప్రత్యక్ష ఉదాహరణ. కరోనావైరస్‌ బారిన పడిన ఎమ్మెల్యే తన పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నిపింది. చెన్నై జిల్లాలోని చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే జె. అన్జాగగన్‌.. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా కాలం.. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు సహాయం చేయాలని.. నిత్యావసరాలు అందించాలంటూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపుతో.. సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు అన్బాగగన్.

కానీ.. అంతగా ప్రజల కోసం సేవ చేసిన ఎమ్మెల్యే అన్జాగగన్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. దాంతో గత కొన్ని రోజులుగా అన్జాగగన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి వెంటిలేటర్‌ సపోర్ట్ తో ఉన్నారు. కాగా ఈరోజు ఉదయం మృతిచెందాడు. 61 ఏళ్ల పూర్తి చేసుకున్న అన్బాగగన్‌.. ఈరోజే 62వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయం. దీంతో అన్జాగగన్‌ కన్నుమూయడంతో.. నియోజకవర్గంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కరోనా నుంచి ప్రజలను కాపాడదామనుకున్న ఎమ్మెల్యేనే కరోనా కాటేసింది అంటూ ఆ నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.